Bhadradri Kothagudem | కొత్తగూడెం టౌన్, జూన్ 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా పాల్వంచ పట్టణానికి చెందిన యువ మహిళా న్యాయవాది ముమ్మాడి పావనిని నియమిస్తూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్, జిల్లా జడ్జి పాటిల్ వసంత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా నియమకపు ఉత్తర్వులు అందుకున్న పావని మాట్లాడుతూ.. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో భాగమైన డిఫెన్స్ లీగల్ ఎయిడ్ సిస్టమ్ ద్వారా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా నియామకం పొందినందుకు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు. నిరుపేద నిందితులకు న్యాయ సహయం అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ భాద్యతలు అప్పగించిన జిల్లా జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం ఛైర్మన్ పాటిల్ వసంత్ కు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ యం. రాజేందర్ కు పావని కృతజ్ఞతలు తెలిపారు. పావని నియామకం పట్ల కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షడు జనపరెడ్డి గోపి కృష్ణ, కోశాధికారి కనకం చిన్ని కృష్ణ, ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ (ఐ.యల్. పి.ఏ) జిల్లా కమిటీ భాధ్యులు హర్షం వ్యక్తం చేశారు.