ఇల్లెందు, జూన్ 29 : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని రోజుల నుండి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న మహా టీవీ న్యూస్ ఛానల్ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి కొత్త బస్టాండ్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మహా న్యూస్ ఛానల్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం దిండిగాల రాజేందర్, సిలివేరి సత్యనారాయణ, టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపిన మహా టీవీ బీఆర్ఎస్ పార్టీపైన, పార్టీ కీలక నేతలపైన అడ్డగోలుగా అసత్య వార్తలను దుష్ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు.
మహా టీవీ న్యూస్ ఛానల్ తన యూట్యూబ్ ఛానల్ లో తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకరమైన కథనాలను సృష్టించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ఆంధ్ర పత్రికలు, టీవీల టార్గెట్ కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమేనని తెలిపారు. అందుకే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే అప్రతిష్ట తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నట్లు వారు దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ఇల్లెందు పట్టణ నాయకులు & 11వ వార్డు మాజీ కౌన్సిలర్ జె కె శ్రీను, పట్టణ మహిళ ప్రధాన కార్యదర్శి కోక్కు సరిత, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, యువజన విభాగం గిన్నారపు రాజేశ్, సత్తాల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్ యాదవ్, ఎంటెక్ మహేందర్, మండల ఉపాధ్యక్షుడు డేరంగుల పోశం, పట్టణ యువజన నాయకులు తోటకూర శ్రీకాంత్, సన రాజేశ్, ఎస్.కె చాంద్ పాషా, మునిగంటి శివ, రామ్ లాల్ పాసి, పరికపెళ్లి రవి, కొండూరు రవికాంత్, గడ్డి శ్రీను, మీరజ్ బేగ్, షేక్ రసూల్, బజారు సత్యనారాయణ, ఈదుల ముత్తయ్య, ఆటో యూనియన్ నాయకులు సముద్రాల తిరుమలరావు, ఎస్.కె పాస్సి, పోషాలు పాల్గొన్నారు.