కొత్తగూడెం అర్బన్, జూన్ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సేవా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు కొత్తగూడెం పోస్ట్ మాస్టర్ ఎన్ వి ఎల్ ప్రసన్న గురువారం తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణలు, కొత్త ఆధార్ కార్డులను నమోదు చేయడం, తదితర సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి సవరణకు రుసుము రూ.50/- నుండి 100/~వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పోస్ట్ ఆఫీస్ పనిచేయు వేళల్లో ఆధార్ కేంద్రం సేవలు పని చేస్తాయని పేర్కొన్నారు.