సుజాతనగర్ : ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు వ్యాపారి సరిగా డబ్బులు ఇవ్వడంలేదని ఆ రైతు ఆగ్రహించాడు. పత్తి వ్యాపారిపై తన కుటుంబ సభ్యులతో దాడికి పాల్పడి అనంతరం పురుగుల మందు తాగాడు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం జమ్మల తండా గ్రామానికి చెందిన ధరావతు దేవ్ కొద్ది రోజుల క్రితం సుజాతనగర్ మండలానికి చెందిన పత్తి వ్యాపారవేత్త చింతలపూడి కృష్ణకు 11 క్వింటాళ్ల పత్తి అమ్మాడు.
పత్తికి సంబంధించి సుమారు 80 వేల రూపాయలు ఇవ్వడం లేదని రైతు గురువారం మండల కేంద్రంలోని వ్యాపారి కృష్ణ వే బ్రిడ్జి వద్ద వచ్చే కుటుంబ సభ్యులతో అతని పై దాడికి పాల్పడ్డారు. అనంతరం రైతు దేవ్ పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.