
పంచాయతీలో అభివృద్ధి పరుగులు
పకడ్బందీగా పారిశుధ్య చర్యలతో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలకు చెక్
ఆహ్లాదానిన పంచుతున్న వనం
ముదిగొండ, జులై 6 :ఆ పల్లెలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. పల్లె ప్రకృతి వనంతో ఆహ్లాదం పంచుతున్నది. గ్రామంలో నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతుండడంతో అంటువ్యాధులు, విషజ్వరాల జాడలేదు. వైకుంఠ ధామాల నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు తొలగాయి. మొత్తంగా పల్లె ప్రగతితో ముదిగొండ మండలం వల్లాపురం పంచాయతీ రూపురేఖలు మారాయి.
ముదిగొండ మండల పరిధిలోని వల్లాపురం గ్రామంలో 1,821 జనాభా ఉంది. మొత్తం 437 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో పది వార్డులు ఉండగా.. 1,365 మంది ఓటర్లు ఉన్నారు. 255 మందికి పింఛన్ అందుతున్నది. గ్రామపంచాయతీకి నెలవారీగా రూ.2,52,351 నిధులు అందుతున్నాయి. పల్లె ప్రకృతి వనంలో 2వేల మొక్కలు పెంచారు.
ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు..
గ్రామంలో ఎప్పటికప్పడు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. రోజూ ట్రాక్టర్‌తో చెత్త సేకరించి డంపింగ్ యా ర్డుకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీకంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. దీంతో గ్రామంలో అంటువ్యాధులు, విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల ఊసేలేకుండా పోయింది. ఆ గ్రామంలో డెంగీ, మలేరియా కేసుల్లేవు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో డ్రై డే నిర్వహిస్తుండడంతో గ్రామం శుభ్రంగా కనిపిస్తున్నది.
ప్రకృతి వనంలో వివిధ రకాల పూల, షో, సుగంధ మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. దీంతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
గొగామంలో అన్ని సౌకర్యాలతో వైకుంఠ ధామాన్ని నిర్మించారు. రెండు దహన వాటికలతోపాటు కర్మకాండల భనవం, స్నానం చేయడానికి షవర్లతో కూడిన గది, టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
థేగామంలో 40 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. గొగామ పంచాయతీ ట్రాక్టర్ ట్యాంకర్‌తో రోజూ హరితహారం మొక్కలకు నీరు పోస్తుండడంతో అవి ఏపుగా పెరుగుతున్నాయి. గ్రామానికి నెలకు రూ. 2,52,351 నిధులు వస్తున్నాయి. ఈ నిధుల నుంచే ప్రతి నెలా గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నారు.
డెంగీ, మలేరియా కేసులు లేవు
ట్రాక్టర్‌తో రోజూ గ్రామంలో చెత్త సేకరిస్తున్నాం. వారంలో రెండు రోజులు పారిశుధ్య పనులు చేపడుతున్నాం. ఈ ఏడాది సాధారణ జ్వరాలు మినహా మలేరియా, డెంగీ కేసులు నమోదు కాలేదు. రోజూ దోమల మందు ఫాగింగ్ చేస్తున్నాం. డ్రైనేజీల్లో సిల్ట్ క్రమం తప్పకుండా తొలగిస్తున్నాం. ఇంకుడు గుంతులు ఏర్పాటు చేశాం. పల్లె ప్రకృతి వనంతో మా ఊరికి కొత్త అందం వచ్చింది.
-సర్పంచ్ అమడాల జక్కర్