చింతకాని: చింతకాని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యచారాలు, వేధింపులు, డయల్100, బాణామతి తదితర అంశాలపై కళాజాత బృందం అవగాహన కల్పించింది. ఈ సందర్బంగా ఎస్సై లవణ్‌కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, సీసీ కెమెరాల ప్రాధాన్యత, మహిళలు-చిన్నారుల రక్షణ, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం జబర్ధస్త్ ఫేం కర్తానందం తన ప్రదర్శనల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంగిడి ఝాన్సీ, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.