సుడా వైరా మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సమావేశం
వైరా, మే 7: కలెక్టర్, సుడా వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు వైరాలోని రైతువేదికలో వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైరా మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్‌ప్లాన్‌లో సూచించిన ఇండస్ట్రియల్ జోన్, రిజర్వాయర్ చుట్టూ బఫర్‌జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్స్ జోన్, రహదారులు, చెరువులు తదితర అంశాలన్నింటినీ మ్యాప్ ద్వారా సుడా అధికారులు వివరించారు.
ఈ మాస్టర్ ప్లాన్ రాబోవు 20 సంవత్సరాల పాటు దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్నామని, అభ్యంతరాలు, సూచనలు ఉంటే మూడు రోజుల్లో రాతపూర్వకంగా సుడా అధికారులకు తెలపాలని సూచించారు. కౌన్సిల్ సభ్యులు పలు అంశాలపై సూచనలు చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మున్సిపాలిటీలో అంతర్గత రహదారులను 30 అడుగులకు పెంచాలని కోరారు. సమావేశంలో వైరా మున్సిపల్ వైస్‌చైర్మన్ సీతారాములు, సుడా డైరెక్టర్ కృష్ణ, తహసీల్దార్ అరుణ, ఆర్అండ్బీ డీఈ దేవిక చౌహాన్, వ్యవసాయశాఖ ఏవో పవన్‌కుమార్, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ జేఈ భగవాన్, సుడా సీపీవో వివేక్, టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీనివాస్, భాస్కర్, కౌన్సిల్‌సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

