E20 Petrol | ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదులాపురం అసోసియేషన్ బిల్డింగ్‌లో E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌పై ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఖమ్మం జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసర్ చందన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. E20 పెట్రోల్‌లో 20% ఇథనాల్ పెట్రోల్‌తోపాటు బ్లెండ్ అయి ఉంటుంది. అందులో కొంచెం నీళ్లు కలిసిన 20% ఉన్న ఇథనాల్ నీళ్లుగా మారిపోతుందన్నారు. పెట్రోల్, డీజిల్ క్వాలిటీని ఫిల్టర్ పేపర్, డెన్సిటీతో ఎలా పరీక్షిస్తారు.. క్వాంటిటీని 5 లీటర్ల క్యాన్‌తో ఎలా చెక్ చేస్తారో వివరించారు.
ఈ కార్యక్రమంలో BPCL సేల్స్ ఆఫీసర్ కిషన్, IOCL సేల్స్ ఆఫీసర్ కిరణ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వర ప్రగడ రంగనాథ్, జనరల్ సెక్రటరి కూరపాటి మంజుల, ట్రెసరర్ వజనెపల్లి శ్రీనివాస రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ సన్నె ఉదయ్ ప్రతాప్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మోతుకూరి గోపాల రావు, డిస్ట్రిక్ అడ్వైసర్స్ నాగబత్తుని రవి, జాయింట్ సెక్రటరీ వెగ్గలం శ్రీనివాస్, దమ్మలపాటి నగేష్, ఈసీ మెంబర్స్ అద్దంకి విప్లవ్ కుమార్, బానోత్ రామ్మూర్తి, ఎమ్. దిలీప్ రెడ్డి, డీలర్స్ దోరేపల్లి రవికుమార్, రాయపూడి పవన్, దాసరి డ్యానియల్, పొదిల వంశీ పాల్గొన్నారు.
Srisailam | శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ ప్రవీణ్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!