కారేపల్లి, జనవరి 26 : కారేపల్లి మండలానికి చెందిన అధికారులు, ఉపాధ్యాయులు తమ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్నారు. కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న నాగరాజకుమారి, సింగరేణి పంచాయతీ సెక్రెటరీ నెహ్రు కలెక్టర్, సీపీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అజ్మీర శివ నాయక్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ చేతుల మీదుగా అందుకున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థకు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఉత్తమ సింగరేణియన్ అవార్డును భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోత్ బావుసింగ్ కు సంస్థ సిఎండి కృష భాస్కర్ చేతుల మీదుగా అందుకున్నారు. పోస్ట్ ఆఫీస్ లో ఉత్తమ సేవను అందించినందుకు గాను మాణిక్యారం డిపిఎం బుసరాజు రామకృష్ణ, బోటి తండా బిపిఎం ఐ సాయి, కారేపల్లి ఏబిపియం రియాజ్ లు పోస్టల్ జిల్లా సూపర్నిటెండెంట్ వీరభద్ర స్వామి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు ఉత్తమ అవార్డులు అందుకున్న అధికారులు ఉపాధ్యాయులను ఆయా శాఖల ఉద్యోగులు అభినందనలు తెలిపారు.