– ప్రారంభించిన సంస్థ అడ్వర్టైజ్మెంట్ జీఎం సురేందర్ రావు
Auto Show | కారేపల్లి (ఖమ్మం), నవంబర్ 08 : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని ఎస్సార్ అం డ్ బిజీఎన్ఆర్ పీజీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షోను ఆ సంస్థల అడ్వర్టైజ్మెంట్ జీఎం సురేందర్ రావు శనివారం ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి రెండు రోజులపాటు కొనసాగే ఆటో షోను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కస్టమర్లు ఆటోలు కొనుగోలు చేసేముందు ప్రతిదాని ప్రైస్, కలర్, ఫీచర్స్, సెక్యూరిటీ ఫీచర్స్, కంపెనీ వంటి అన్నింటినీ పోలిక చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దానికి అన్ని రకాల కంపెనీ ఔట్లెట్లను సందర్శించాల్సి ఉంటుందని చెప్పారు. అలా కాకుండా ఒకటే వేదిక మీద అన్ని రకాల ఆటో మొబైల్ సంస్థలు ఉన్నట్లయితే, అలాగే దానికి ఫైనాన్స్ చేయడానికి బ్యాంకులు కూడా జోడైతే కొనుగోలుదారుడికి నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం ఈ రెండిటికీ సులువుగా ఉంటుందన్నారు.
ఈ ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి ఆటో షోని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్నట్లు, డిసెంబర్ 15 వరకు ఇటువంటి ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఖమ్మం పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మొదటిరోజు బుకింగ్స్ పై లక్కీ డ్రా విజేతులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ రేనా రమేశ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, ఎడిషన్ ఇన్చార్జి పి.వెంకట అప్పయ్య, టీ న్యూస్ జిల్లా ఇన్చార్జి సాంబ, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, సర్కులేషన్ మేనేజర్ కె.రాంబాబు, ఖమ్మం ఆర్సీ ఇన్చార్జి ఎస్.శ్రీనివాసరావు, స్థానిక పాత్రికేయులు, అడ్వర్టైజ్మెంట్, సర్కులేషన్ సిబ్బంది, బ్యాంకర్స్, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Namasthe Telangana – Telangana Today Auto Show

Namasthe Telangana – Telangana Today Auto Show