కారేపల్లి, మే14 : సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గంగాధరణి రవీంద్ర చారి (38) వెన్నెముక సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ పేద కుటుంబానికి చెందిన రవీంద్ర చారి అకాల మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. రవీంద్ర కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో యూనియన్ నేతలు కోరారు. రవీంద్ర చారి మృతి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యాల వెంకట అప్పారావు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేతలు వెగ్గళం నాగ బ్రహ్మచారితో పాటు పలువురు గురువారం మృతదేహానికి నివాళులర్పించారు. రవీంద్రచారికి భార్య సౌజన్య, కుమారుడు సాత్విక్ ఉన్నారు.