కారేపల్లి, మే 07 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోటమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో గురువారం దుకాణాల సముదాయం, కొబ్బరి చిప్పలు పోగు చేయడంకు సంబంధించి బహిరంగ వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి వేణుగోపాలచార్యులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దుకాణాల సముదాయం, టెంటు సామాన్లు సరఫరా, కొబ్బరి చిప్పలు రోగు చేయుట గూర్చి ఆసక్తి కలవారు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలన్నారు. వేలం పాటలు ఒక సంవత్సరం కాలానికి మాత్రమే పరిమితి ఉంటుందన్నారు.
ఈ వేలంపాట కమిషనర్, దేవాదాయశాఖ, హైదరాబాద్ వారి ఉత్తర్వులకు లోబడి ఉంటుందన్నారు. దేవస్థానానికి బకాయి ఉన్నవారు కాని, దేవస్థానం సొమ్ము చెల్లింపులో జాప్యం చేసిన వారు, దేవాదాయ శాఖ ఉద్యోగస్తులు, మైనర్లు బహిరంగ వేలంలో పాల్గొనుటకు అనర్హులని తెలిపారు. హెచ్చుపాటదారుడు డిపాజిట్‌తో సంబంధం లేకుండా పాట మొత్తంలో సగం సొమ్ము వెంటనే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.