కారేపల్లి, జూన్ 21 : అంగన్వాడీ కేంద్రాలను ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరచి ఉంచడంతో పాటు లబ్ధిదారుల హాజరును పోషణ్ ట్రాకర్‌లో నమోదు చేయాలని ఐసీడీఎస్ కామేపల్లి ప్రాజెక్ట్ సీడీపీఓ దయామణి అన్నారు. శనివారం సింగరేణి మండలం అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు వాళ్ల ప్రీస్కూల్ ని అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్లపని తీరును మెరుగుపరచడానికి కావాల్సిన సామర్థ్యం కోసం పరీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ.. గర్భిణీలందరూ కూడా అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు ఆశ, అంగన్వాడీ టీచర్ కలిసి ఐరన్ టాబ్లెట్స్ మింగించాలని సూచించారు. తీవ్రమైన పోషకాహార లోపం, బరువు తక్కువ ఉన్న పిల్లల బరువు, ఎత్తును అప్డేట్ చేయాలన్నారు. పోషణ్ ట్రాకర్, ఎన్.హెచ్.టీ.ఎస్ లలో లబ్ధిదారులు సరిపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.