రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే పుట్టగతులుండవు : సిఐటియు
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే పుట్టగతులుండవు అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ రావు హెచ్చరించారు. మంగళవారం..
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 14 : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే పుట్టగతులుండవు అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ రావు హెచ్చరించారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వరంగల్ క్రాస్ రోడ్డు కార్ల షోరూం దగ్గర ఆల్ ఆటోమొబైల్ షోరూమ్స్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ భారత్ దేశంలో ఉన్న మొత్తం సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, రాజ్యాంగంలో ఈ దేశంలో బ్రతకటానికి అనేక హక్కులు కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నేటి పాలకులకు రాజ్యాంగాన్ని చిత్తశుద్దిగా అమలు చేయకుండా మీనమేషాలు లెక్కించడం జరుగుతుందని విమర్శించారు. ఈ సభలో రైతు సంఘం జిల్లా నాయకుడు వూరడి సుదర్శన్ రెడ్డి, వ్యవసాయ కార్మికు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లమూడి నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు కారుమంచి గురవయ్య, తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెరుమాళ్ల పల్లి శ్రీనివాసరావు, తెలంగాణ గురుకులం ఉపాద్యాయుల రాష్ట్ర అధ్యక్షుడు దూలం,యలయ్య, ఆటో మొబైల్స్ షోరూమ్స్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షుడు నాగ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు బి.వెంటేశ్వరావు, కోశాధికారి ప్రవీణ్, సహాయ కార్యదర్శి బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల, ప్రకాష్, గుగ్గిల వీరబాబు, శ్రీకాంత్, నరేష్, గోవర్ధన్, వసంత బాబు, గోపినాథ్, శేఖర్, మందా వీరబాబు, నాగరాజు, పి.వీరబాబు, వై.రాంబాబు, నక్క శ్రీరాములు, మదు, లింగరాజు, బిల్డింగ్ వర్కర్స్ నాగేశ్వరరావు, శ్రీను, వెంకటేశ్వర్లు, వీరయ్య, హమాలీ నాయకులు సుధాకర్, సోమయ్య, చారి, నాగయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- citu
- constitution
- khammam news
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

