చండ్రుగొండ, జూలై 8: బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో నాటి పోడుదారులంతా నేడు పట్టాదారులయ్యారని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అశ్వారావుపేట ఏజెన్సీలో 30 ఏళ్ల పోడు సమస్యకు ముగింపు చెప్పిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. మండలంలోని సీతాయిగూడెం, తిప్పనపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించిన ఆయన.. ఆయా గ్రామాల్లోని పోడుదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతాయిగూడెంలో 41 మందికి, తిప్పనపల్లిలో 34 మందికి, మద్దుకూరులో 41 మందికి పోడు పట్టాలు అందజేశామని అన్నారు. ఇంకా ఎవరికైనా అర్హులు ఉంటే నేరుగా తమకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వారి పేర్లను పరిశీలించి ఉన్నతాధికారులకు పంపి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాలను సాగు చేసుకుంటున్న 10 వేల మందికి పోడు పట్టాలు అందించినట్లు వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రేవతి, దారా వెంకటేశ్వరరావు, ఉప్పతల ఏడుకొండలు, గాదె లింగయ్య, లంకా విజయలక్ష్మి, ధరావత్ పార్వతి, కీసరి శాంతమ్మ, సయ్యద్ రసూల్, నల్లమోతు వెంకటనారాయణ, బోయినపల్లి సుధాకర్‌రావు, పైడి వెంకటేశ్వరరావు, గాదె శివప్రసాద్, మేడా మోహన్‌రావు, భూపతి రమేశ్, పాండ్ల అంజన్‌రావు, సత్తి నాగేశ్వరరావు, మద్దిరాల చిన్నిపిచ్చయ్య, భూపతి శ్రీనివాసరావు, ఉన్నం నాగరాజు, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబూరావు, గుగులోత్ శ్రీనివాస్‌నాయక్, గుగులోత్ రమేశ్, బొర్రా కేశవులు, ఓరుగంటి రాములు, పూసం వెంకటేశ్వర్లు, ప్రవీణ్ ప్రకాశ్, శ్రావణ్‌కుమార్, హనుమంతరావు పాల్గొన్నారు.