కారేపల్లి, (ఏన్కూర్)డిసెంబర్ 15: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏన్కూర్ మండలంలోని పలు సమస్యాత్మర పోలింగ్ స్టేషన్లను కల్లూరు ఏఎస్పీ (Kalluru ASP) వసుంధర యాదవ్ (Vasundhara Yadav) పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాలైన గార్ల ఒడ్డు, భగవాన్ నాయక్ తండాలో స్వయంగా పర్యటించిన ఏఎస్పీ బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతిఒక్కరూ సమన్వయం పాటించాలని ఏఎస్పీ వసుంధర యాదవ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎఏస్పీ హెచ్చరించారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులు, స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు సహకారం అందించాలని వసుంధర యాదవ్ అన్నారు.