కారేపల్లి, ఆగస్టు 08 : కారేపల్లి మండలంలో వన మహోత్సవానికి ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం గేటుకారేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా తుప్పలను తొలగించి మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. వన మహోత్సవంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. నాటిన మొక్కల రక్షణకు ఏర్పాట్లు చేయటం జరుగుతుందన్నారు. వన మహోత్సవంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కోటేశ్వరావు, కార్యదర్శి పార్వతి, టీఏ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.