– హాజరైన ప్రజా ప్రతినిధులు, నాయకులు
కారేపల్లి, ఆగస్టు 13 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం సూర్యతండా గ్రామంలో ఆర్మీ జవాన్ బానోత్ అనిల్ అంత్యక్రియలు బుధవారం సైనిక లాంఛనాలతో ముగిశాయి. స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, బానోత్ మంజులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై జవాన్ అనిల్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం కశ్మీర్ లోయలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సూర్యతండాకు చెందిన జవాన్ అనిల్ మృతి చెందాడు.