మామిళ్లగూడెం, జనవరి 22 : అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం కోసం పంపించారు. మద్దెల సంఘవి, వైరా మండలం సిరిపురానికి చెందిన తడికమల్ల స్వర్ణలత, చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.కె.జాన్‌సాహెబ్,
ఖమ్మంలోని తుమ్మలగడ్డకు చెందిన ఎస్.కె.యాకూబ్ పాషా, నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన దండా మురళి, బేబి ప్రసూన, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన డి.రాజా తదితరులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతులు సమర్పించారు. గ్రీవెన్స్‌లో జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతి, డీసీవో విజయకుమారి, జిల్లా వైద్యాధికారి బి.మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విద్యాచందన, డీపీవో హరికిషన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.