ఇంటి నుంచే బ్యాంకు ఖాతా
కాలానుగుణంగా సాంకేతికత మారుతున్నది. గతంలో బ్యాంకు ఖాతా కావాలంటే కనీసం వారం రోజుల సమయం పట్టేది. ఖాతా తెరవడానికి బ్యాంకుకు వెళితే రేపు రమ్మని సమాధానం. తీరా వెళితే సాంకేతిక సమస్య అని జవాబు. ఇక మళ్లీ మళ్లీ బ్యాంక్‌కు వెళ్లాల్సి వచ్చేది.
- కేవలం 10 నిమిషాల్లోనే ఏపీజీవీబీ ఖాతా
- దిశ యాప్‌తో ఇంటి వద్ద నుంచే సేవలు
- అరచేతిలోనే లావాదేవీలు
పెనుబల్లి, నవంబర్ 1: కాలానుగుణంగా సాంకేతికత మారుతున్నది. గతంలో బ్యాంకు ఖాతా కావాలంటే కనీసం వారం రోజుల సమయం పట్టేది. ఖాతా తెరవడానికి బ్యాంకుకు వెళితే రేపు రమ్మని సమాధానం. తీరా వెళితే సాంకేతిక సమస్య అని జవాబు. ఇక మళ్లీ మళ్లీ బ్యాంక్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) ఖాతా మాత్రం ఇప్పుడు ఇంటి నుంచే తీసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన సంతకం చేసుకుని పెట్టుకున్న తెల్ల కాగితం ఉంటే చాలు నిమిషాల్లో ఖాతా తెరవచ్చు.
ఇలా చేయండి..
ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి ఏపీజీవీబీ దిశ (డిజిటల్ ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్) యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే రెండు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. డిజిటల్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు ‘ఐ నీడ్ ఎ బ్యాంక్ అకౌంట్’ అని చూపించే బాణం మార్కుపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. తర్వాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘కంటిన్యూ విత్ ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్’ ‘ కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్ అకౌంట్’ ఉంటాయి. రెండోది సెలక్ట్ చేసుకోవాలి. 2వ ఆప్షన్ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. నామినేషన్, మొబైల్ బ్యాకింగ్ ద్వారా ‘గ్రీన్ఫిన్’ ద్వారా ఏటీఎం పిన్ సెలక్ట్ చేసుకోవాలి. దీనిలో సింగిల్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. ‘ఓకే’పై క్లిక్ చేయగానే, కంటిన్యూ విత్ ఆధార్ అని చూపిస్తుంది. దీంతో బ్రాంచ్ సెలక్ట్ చేసుకోమని చూపిస్తుంది.
వెరిఫికేషన్ కోసం యూఐడీఏఐ పంపించిన కోడ్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఫోటో ఆటోమేటిక్‌గా ఆధార్ డేటా బేస్ నుంచి క్యాప్చర్ అవుతుంది. తర్వాత నామినీ వివరాలు ఎంటర్ చేయాలి. ఏదైనా తప్పులుంటే సరి చేసుకుని సబ్మిట్ చేయాలి. తర్వాత కేవైసీ వెరిఫికేషన్ కోసం వీడియో కాల్‌పై క్లిక్ చేయగానే రిఫరెన్స్ కోడ్ వస్తుంది. మూడు రోజుల్లో రిఫరెన్స్ కోడ్‌ను ఉపయోగించుకుని ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ కోడ్ కింద బ్లూ కలర్ లింక్‌ను క్లిక్ చేయగానే అది డైరెక్ట్ సైట్లోకి తీసుకెళుతుంది. ‘స్టార్ట్ జర్నీ’పై క్లిక్ చేయాలి. తర్వాత ‘ఆర్ యూ రెడీ విత్ ఫాలోయింగ్’ అనే ఆప్షన్ చూపిస్తుంది. డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుని ‘ఎస్ ఐ యాం రెడీ’అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కొద్దిసేపు ఆగాల్సి ఉంటుంది. ఆ లోపు యాప్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. వాటికి ‘ఓకే’ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఒక వేళ అప్పుడు కాల్ కనెక్ట్ కాకుంటే మన షెడ్యూల్ మార్చుకోవచ్చు. కాల్ కనెక్ట్ కాగానే వారు చెప్పిన గైడెన్స్ ఫాలో కావాలి. బ్యాంకు ఎగ్జిక్యూటివ్స్‌కు వీడియో కాల్ ద్వారా మన పాన్ కార్డు చూపిస్తూ, పేపర్‌పై సంతకం చేసి చూపించాల్సి ఉంటుంది. తర్వాత మన ఫొటోను క్యాప్చర్ చేస్తారు. దీనితో బ్యాంకు అకౌంట్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. మొబైల్‌కు అకౌంట్ నంబర్ మేసేజ్ వస్తుంది. ఇక లావాదేవీలు ప్రారంభించుకోవచ్చు. ఒక వేళ జాయింట్ అకౌంట్ కావాలంటే సెలక్ట్ చేసుకున్న హోం బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
బ్యాంకుకు రాకుండానే సేవలు
ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటల్ సేవలు ప్రారంభయ్యాయి. ప్రతి ఇంట్లో స్మార్ట్ఫోన్లు ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నుంచి ఇప్పుడు ఏపీజీవీబీ బ్యాంకు ఖాతా తెరవొచ్చు. బ్యాంకుకు రాకుండానే పారదర్శకంగా సేవలు పొందవచ్చు. బ్యాంకు సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదారులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా ఇంట్లో నుంచే బ్యాంక్ సేవలు పొందవచ్చు.
– అన్సర్‌ఖాన్, మేనేజర్, ఏపీజీవీబీ, పెనుబల్లి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- APGVB
- APGVB account
- penuballi
RELATED ARTICLES
తాజా వార్తలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

