మధిర, ఏప్రియల్ 10 : మధిర మండలంలోని మాటూరు గ్రామంలో శ్రీభూనీళా సహిత చెన్నకేశవ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం ఈ నెల 12వ తేదీన జరుగుతుందని అర్చకులు తెలిపారు. మొదటి రోజు 11న ఉదయం అనగా స్వామి వారికి అభిషేకం అలంకరణ అర్చనలు, దేవాలయంలో మామిడితోరణం అలంకరణను నిర్వహిస్తారు. సాయంత్రం విష్వక్సేనారాధన అంకురారోపణ, హోమం, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగును.
12న సాయంత్రం స్వామి వారి కల్యాణమహోత్సవం ఉంటుందని తెలిపారు. 13న ఉదయం కొట్నాలు, వసంతోత్సవం, చక్ర స్నానం జరుగును. సాయంత్రం గరుడ సేవ, తదనంతరం ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవ నిర్వహిస్తాను భక్తులు అందరూ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కరుణాకటాక్ష వీక్షణములు పొందాలని అర్చకులు కోరారు.