కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 8 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
తమకు తక్కువ వేతనాలు అందిస్తూ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, ఎన్హెచ్ఎం స్కీంలో పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వేల్పుల మల్లికార్జున్, ఎండీ.యూసుఫ్, బానోతు ప్రియాంక, పార్వతి, బాలనాగమ్మ, పద్మజ, ఇందిర, అరుణ, సుమలత, రాములమ్మ, జ్యోతి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.