కారేపల్లి, జూన్ 29 : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మహా న్యూస్ ఛానల్ చేసిన ఆసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ ఖమ్మం జిల్లా నాయకుడు జూపల్లి రాము తెలిపారు. ఆదివారం కారేపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహా న్యూస్ ఛానల్‌పై దాడి చేశారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. గతంలో థంబ్ నేల్స్ పెట్టి కేటీఆర్‌ను వ్యక్తిగతంగా అవమానపరుస్తూ క్యారెక్టర్ని బదనాం చేసే విధంగా ఆంధ్రా మీడియాలో ప్రసారం చేయడం హేయమైన చర్య అన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం అయితే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చలేక కేటీఆర్ పైన ఫోన్ టాపింగ్ అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందరి ఎద్దేవా చేశారు.