కారేపల్లి, జనవరి 8 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994-95లో పదో తరగతి చదివిన విద్యార్థులు స్థానిక పాఠశాలలో ఆదివారం ఒకే వేదికపై చేరుకుని సందడి చేశారు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత కలుసుకున్న చిన్నినాటి స్నేహితులు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. అనంతరం నాటి గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సామినేని జగన్మోహన్రావు, శంకరయ్య, సత్యనారాయణ, సత్యప్రసాద్, పారుపల్లి సురేశ్, నర్సింహాచారి, రామకృష్ణాచారి, ఇమ్మడి తిరుపతిరావు, వై.వి.రమణ, ఆదెర్ల ఉపేందర్, కూరపాటి సరిత, భూక్యా శేఖర్, పాల రమేశ్, మండెపూడి శ్రీను, భనవాన్, మహబూబాబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, జనవరి 8 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1976-77 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. విద్యార్థులు పూర్వ అనుభవాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు రామానుజచార్యులు, బీ.శేషభూషణం, రంగారావు, జే.సత్యనారాయణలను ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 46 సంవత్సరాల తర్వాత తమను గుర్తుంచుకొని సన్మానించి జ్ఞాపికలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పోనాటి శేషగిరి, జీ.రామచంద్రరావు, డీ.వీ.కృష్ణారావు, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.