Kothagudem | చండ్రుగొండ, జులై 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రకృతి వనాలు పల్లె అందాలకు అద్దం లాగా ఉండగా నేడు మద్యం ప్రియులకు అడ్డగా మారినాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీలకు మెయింటినెన్స్ నిధులు రాక పంచాయతీ అధికారులు పల్లెపకృతి వనాల నిర్వహణ పూర్తిగా వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని 14 పంచాయతీల్లో దాదాపు అన్ని పకృతి వనాల్లోని మొక్కలు ఎండిపోతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు నిధులు లేక వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుచున్నారు.