కారేపల్లి, నవంబర్ 20 : కారేపల్లి మోడల్ స్కూల్‌ను మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి గురువారం సందర్శించారు. స్కూల్లో లైబ్రరరీ, టాయిలెట్స్, స్పోర్ట్ రూమ్, కిచెన్ రూమ్ తనిఖీ చేశారు. లైబ్రరరీ, స్పోర్ట్ వస్తువుల వినియోగంపై ఆరా తీశారు. టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మోడల్ స్కూల్ వసతి గృహం, పాఠశాల పరిసరాలను తిరిగి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అడిషనల్ డైరక్టర్ వెంట ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, సీఎంఓ ప్రవీణ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎలియట్ ప్రేమ్‌కుమార్, ఎంఐఎస్ మోతీలాల్, ఎంసీఓ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.