కొత్తగూడెం : యూరియా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతుండగా మరోవైపు అధికారులు అడ్డదారి తొక్కుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాకు చెందిన ఏడీఏ ఉల్లోజ్ నరసింహరావు ( ADA Narasimha Rao) రూ. 25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు. యూరియాను ఇన్వాయిస్ లేకుండా విక్రయించడంతో పాటు ఎలాంటి న్యాయ సమస్యలు రాకుండా కాపాడేందుకు ఎరువుల దుకాణం యజమాని ఏడీఏను సంప్రదించాడు.
ఇందుకుగాను ఏడీఏ రూ. 25వేలు డిమాండ్ చేయడంతో దుకాణం యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. సోమవారం పథకం ప్రకారం ఏడీఏ లంచం తీసుకుంటుండగా మాటువేసి రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. పట్టుకున్న నగదును సీజ్ చేసి ఏడీఏపై కేసు నమోదు చేసి వరంగ్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.