కారేపల్లి, నవంబర్ 19 : కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజరలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పేరు మీద గల 3 ఎకరాల 8 గుంటల భూమి ఉందని, దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకోనున్నట్లు ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ దేవాలయ కార్యనిర్వహణ అధికారి వేణుగోపాలాచారి అన్నారు. బుధవారం కారేపల్లిలో ఈఓ విలేకరులతో మాట్లాడుతూ.. విశ్వనాధపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 362/10 లో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పేరు మీద 3 ఎకరాల 8 గుంటల భూమి కలదని, అట్టి భూమిని ఎవరైనా ఆక్రమించినా, గృహ నిర్మాణాలు చేసినా చర్యలు తప్పవని తెలిపారు.