భూదాన్ పోచంపల్లి : పట్టణ కేంద్రంలో ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ ( Konda Lakshman Bapuji ) 110 జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ కాo స్య విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత నాయకులు తడక వెంకటేశ్వర్లు , పోచంపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, మాజీ ఎంపీపీ బడుగు దానయ్య, పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేష్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవ కుమార్, నాయకులు కర్నాటి పాండు, చిట్టిపోలు శ్రీనివాస్, అంకం మురళి, అంకం పాండు, చింతకింది రమేశ్, కర్నాటి పురుషోత్తం, సురపల్లి శ్రీనివాస్, గంజి కృష్ణ మంగళపల్లి శ్రీహరి , సీత చక్రపాణి,సిద్దుల రామచంద్రం , బుచ్చమ్మ, భారతమ్మ , తదితరులు పాల్గొన్నారు.