కన్నుల పండువగా బొల్లోరుగూడెం పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!
పాల్వంచ పట్టణంలోని బొల్లోరుగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కన్నుల పండువగా జరిగింది.
పాల్వంచ, ఫిబ్రవరి 16 : ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం. ఆటాపాటలు, చిలిపి పనులు, కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో పాఠశాల అవరణం కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాల్వంచ పట్టణంలోని బొల్లోరుగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కన్నుల పండువగా జరిగింది.
ఎక్కడెక్కడో స్థిర పడిన వారు, ఉద్యోగులుగా, గృహిణులుగా, వేర్వేరు రంగాల్లో స్థిర పడ్డ వారు తమ మిత్రులను కలవాలనే తలంపుతో ఒక్క చోటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. దివంగతులైన ఉపాధ్యాయులు బ్రహ్మచారి, తెలుగు పండిట్ రాజు, సైన్స్ టీచర్ ఇందిర, పీఈటీ మురళిలకు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, నాగేశ్వరరావు, సుధాకర్, పద్మలత, జేవీఆర్ శ్రీనివాస్, వీటీఆర్, కూర్మేశ్వర్ రావు, సీతారామలక్ష్మి, శారద, శ్రీనివాస్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు, పాడిన పాటలు అలరించాయి. వచ్చిన పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో పొద్దు పోయే వరకు గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్య స్థానాలకు వారు కదిలారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
Medicover Hospital | మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన : కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

