అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి ‘కోరం’
జడ్పీ చైర్మన్‌గా జిల్లాలో అందరినీ కలుపుకొనిపోతూ.. మారుమూల ప్రాంతా ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో జడ్పీ చైర్మన్‌గా నాలుగేళ్లకు పైగా కొనసాగి..
- భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, జడ్పీ చైర్మన్ కంచర్ల
- జడ్పీ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఘనంగా వీడ్కోలు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : జడ్పీ చైర్మన్‌గా జిల్లాలో అందరినీ కలుపుకొనిపోతూ.. మారుమూల ప్రాంతా ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో జడ్పీ చైర్మన్‌గా నాలుగేళ్లకు పైగా కొనసాగి.. తిరిగి ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కోరం కనకయ్య సన్మాన సభ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన బిడ్డగా కోరం కనకయ్య కోయగూడెం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారన్నారు. జడ్పీ చైర్మన్‌గా నాలుగేళ్లకుపైగా పని చేయడంతోపాటు ఇల్లెందు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారని అన్నారు. వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులతో ఆప్యాయంగా ఉంటూ..
వారిని నొప్పించకుండా ఒప్పించి ప్రజాసేవ కోసం పనిచేసిన కనకయ్య అభినందనీయులని అన్నారు. నాలుగేళ్ల పదవీ కాలంలో ఎక్కడా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా పని చేశారన్నారు. ఈ సందర్భంగా కోరం కనకయ్య, లక్ష్మి దంపతులను గజమాలతో సన్మానించారు. జడ్పీ సీఈవో విద్యాలత అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో అదనపు కలెక్టర్ మధుసూదనరాజు, జిల్లా సంక్షేమాధికారి విజేత, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డి.వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ భీమ్లా, డీపీఆర్వో శ్రీలం శ్రీనివాసరావు, డీసీహెచ్ఎస్ రవిబాబు, ఎంపీడీవో రామారావు, ఎంపీవో మన్నె శ్రీనివాసరావు మాట్లాడారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ ఉద్యోగులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

