
మణుగూరు రూరల్/ పినపాక, అక్టోబర్ 30: డిమాండ్ ఉన్న పంటలవైపే రైతులు మొగ్గు చూపి అధిక లాభాలు పొందాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. అశ్వాపురం మండలంలోని నెల్లిపాక పంచాయతీలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పాం తోటను, బీజీ కొత్తూరులో ఆయిల్‌పాం నర్సరీ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ సాగు సాధ్యమవుతుందని, ఒకసారి నాటితే 30 ఏండ్లపాటు పంట వస్తుందని అన్నారు. మూడేళ్లలోపు అంతర పంటలుగా కూరగాయలు, శ్రీగంధం, మినుములు తదితరాలను సాగు చేసుకోవచ్చన్నారు. నాలుగో ఏడాది నుంచి ఆయిల్‌పాం పంట చేతికి వస్తుందని అన్నారు.
పినపాక భూములు అనుకూలం.. : ఆయిల్‌పామ్ సాగుకు పినపాక మండలంలోని భూములు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. పినపాక మండలంలోని జానంపేటలో ఆయిల్‌పాం సాగుకోసం శనివారం భూములను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయిల్‌పాం సాగు వల్ల నాలుగో ఏట నుంచి ఎకరానికి నికరంగా రూ.లక్ష వరకూ ఆదాయం వస్తుందన్నారు.
లాభదాయకమైన పంట ఆయిల్‌పాం : ఆయిల్‌పాం పంట లాభదాయకమైనదని విప్ రేగా కాంతారావు అన్నారు. ఈ పంటను సాగు చేసి ప్రభుత్వం నుంచి అందే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. మణుగూరు తన క్యాంపు కార్యాలయంలో శనివారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కార్యక్రమాల్లో ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ మేనేజర్లు బాలకృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఏడీఏ తాతారావు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు ముత్యంబాబు, వట్టం రాంబాబు, ముత్తినేని సుజాత, ఎండీ షరీఫ్, కొల్లు మల్లారెడ్డి, మర్రి మల్లారెడ్డి, వెంకటరమణ, కమటం నరేశ్, తాటి పూజిత, తిరుపతిరావు, మాధవి, గోపిరెడ్డి రమణారెడ్డి, వలబోజు మురళీకృష్ణ, కోరెం రామారావు, బొబ్బాల నాగేశ్వరరావు, ముత్తినేని వాసు, గుమ్మడి గాంధీ, బాడిశ మహేశ్, జినుగు మరియన్న, వెంకటేశ్వర్లు, శాంతిప్రియ, విక్రమ్‌కుమార్, భద్రయ్య, వర్మ, పి.సతీశ్‌రెడ్డి, వాసుబాబు పాల్గొన్నారు.