
‘పాలెం’ మండలాన్ని అన్నింటా ముందుంచుతాం
గ్రామాలన్నింటికీ సుడా నిధులు కేటాయిస్తాం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్
రూ.2 కోట్లతో చేపట్టిన డివైడర్, సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
రఘునాథపాలెం, అక్టోబర్ 30: రఘునాథపాలెం మండలంలో మంచుకొండ గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మంచుకొండ గ్రామంలో రూ.2 కోట్ల సుడా నిధులతో నిర్మించిన రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి అజయ్‌కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనను రాజకీయంగా లీడర్‌ను చేసిన రఘునాథపాలెం మండలాన్ని జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేనన్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రఘునాథపాలెం తనను ముందుండి నడిపించిందని గుర్తుచేశారు. అందుకని ఈ మండల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. సుడా నిధులు నిరంతర ప్రక్రియగా రఘునాథపాలెం మండలానికి వస్తాయని, అన్ని గ్రామాలకూ నిధులను చేరవేస్తానని అన్నారు. అనతికాలంలోనే రూ.కోట్ల నిధులు కేటాయించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ నాయకుడు మందడపు నర్సింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మేయర్ పునకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, మాజీ అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, టీఆర్ఎస్ నాయకులు మందడపు సుధాకర్, ఉప సర్పంచ్ తేజావత్ రమేశ్, మాజీ సర్పంచ్ భుక్యా లక్ష్మణ్‌నాయక్, బోడా సైదులు, ఎంపీటీసీ తేజావత్ రాణి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధరావత్ రామ్మూర్తినాయక్, నాయకులు పిన్ని కోటేశ్వరరావు, పొట్లపల్లి రాజా, బండి నాగేశ్వరరావు, నున్నా శ్రీనివాసరావు, భుక్యా రాము, లాలు, బాబు, మల్లయ్య, మహెష్, వెంకన్న, భిక్షం, లాజర్, విజయ్ పాల్గొన్నారు.