ఈ నెల 30 నుంచి పోడు పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పట్టాల పంపిణీని ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, భద్రాద్రి జిల్లాలో 1,51,195 ఎకరాలకు గాను 50,595 మంది గిరిజనులకు మంత్రి హరీశ్‌రావుతో కలిసి తాను పట్టాలు అందిస్తానని చెప్పారు. దశాబ్దాల పోడు రైతుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని అన్నారు. అందుకు ముఖ్యమంత్రికి తాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. – ఖమ్మం, జూన్ 24
ఖమ్మం, జూన్ 24: ఈ నెల 30 నుంచి పోడు పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అజయ్ తెలిపారు. పట్టాల పంపిణీని ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, భద్రాద్రి జిల్లాలో 1,51,195 ఎకరాలకు గాను 50,595 మంది గిరిజనులకు మంత్రి హరీశ్‌రావుతో కలిసి తాను పట్టాలు అందిస్తానని చెప్పారు. పోడు రైతుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని అన్నారు. అందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.
ఈ నెల 30 నుంచి గిరిజనుల పోడు భూములకు పట్టాలను పంపిణీ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ తాతా మధు శనివారం తెలిపారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఈ నెల 30న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజున పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారని వివరించారు.