మణుగూరు టౌన్, ఆగస్టు 29: బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రజలందరూ పార్టీలకు అతీతంగా వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ అశోక్‌నగర్, టెలిఫోన్ ఎక్సేంజ్ ఏరియాకు చెందిన 30 కుటుంబాల వారు మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ రేగా సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ విప్ రేగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ జెండాయే శ్రీరామరక్ష అనే భావనతో ప్రజలందరూ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
కేసీఆర్, రేగా గెలుపు కోసం పాదయాత్ర..
ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గెలుపును కాంక్షిస్తూ బీఆర్ఎస్ నాయకులు భద్రాచలం రామాలయానికి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను ప్రభుత్వ విప్ రేగా.. మంగళవారం మణుగూరులోని తన క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించి మాట్లాడారు.