
అభివృద్ధి, సంక్షేమంలో వెనుకడుగు వేయం
బూర్గంపహాడ్ పర్యటనలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
టీఆర్ఎస్లోకి ఎన్పీ రెడ్డిపాలెం సర్పంచ్ దంపతులు
బూర్గంపహాడ్, డిసెంబర్ 28: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధిలో అగ్రభాగాన ఉందని, అభివృద్ధిలో వెనుకంజ వేయబోమని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా కృషిచేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమని, పార్టీకి విధేయులుగా ఉంటూ పార్టీ బలోపేతానికి పాటుపడేవారికి ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని అన్నారు. ‘ఇంటింటికీ కేసీఆర్.. గ్రామగ్రామానికీ టీఆర్ఎస్’ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహిస్తున్నానని, ప్రతి గ్రామంలో సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే తన లక్ష్యమని అన్నారు. బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని స్పష్టం చేశారు.
పార్టీని నమ్మి వచ్చిన వారికి అండగా ఉంటానని, నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కాగా, టీఎన్టీయూసీ నుంచి టీఆర్ఎస్లోకి ఐదుగురు కార్మికులు చేరారు. రాబోయే రోజుల్లో శ్రామికశక్తి యూనియన్‌కు మద్ధతుగా నిలుస్తామని రేగా తెలిపారు. జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు జలగం జగదీశ్, జక్కం సుబ్రహ్మణ్యం, సిరిపురం స్వప్న, తాటి వీరాంజనేయులు, కుంజా చిన్నబ్బాయి, పాయం వెంకటేశ్వర్లు, కొడెం వెంకటేశ్వర్లు, సోంపాక నాగమణి, యడమకంటి ఝాన్సీలక్ష్మి, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కొల్లేటి భవానీ శంకర్, కాటం వెంకట్రామిరెడ్డి, సాలయ్య, చేతుల పెద్దవీర్రాజు, కుర్సం వెంకన్న, తోటమళ్ల సరిత, శ్రామికశక్తి యూనియన్ అధ్యక్షుడు సానికొమ్ము శంకర్‌రెడ్డి, కామిరెడ్డి రామకొండారెడ్డి, బెల్లంకొండ రామారావు, మేడం లక్ష్మీనారాయణరెడ్డి, సాబీర్‌పాషా, గోనెల నాని, కొనకంచి శ్రీనివాసరావు, బెజ్జంకి కనకాచారి, బొల్లు రవి, గోవర్దన్, పూర్ణ, దారం కృష్ణారెడ్డి, బోనం నాగిరెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి సర్పంచ్ దంపతులు..
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ భూక్యా శ్రావణి, శివ దంపతులు ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై తాము గులాబీ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. సర్పంచ్ దంపతులకు ఎమ్మెల్యే రేగా గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. వారితోపాటు గ్రామంలోని మరో 100 కూడా కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి.