
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రధాన రహదారుల్లో బీటీ రోడ్లు
సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్‌కుమార్
ఖమ్మం, డిసెంబర్ 28: నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలోని అంతర్గత రోడ్లను నిర్మించి ప్రధాన రహదారులకు అనుసంధానం చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. నగరంలో వివిధ డివిజన్లలో రూ.1.6 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి అజయ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 53వ డివిజన్ ఎన్ఎస్టీ రోడ్డు, 26వ డివిజన్ పోలీసు కమిషనర్ కార్యాలయం, 24వ డివిజన్ కాశయ్య నగర్, 12వ డివిజన్ రాధాకృష్ణనగర్ వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్లను నిర్మించినట్లు చెప్పారు. ఖమ్మం న గరాభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్‌లోనూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు పేరొన్నారు. రూ.30 కోట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు నిధుల నుంచి 41 డివిజన్లలో 140 రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే నగరంలో పలు ప్రధాన దా రుల్లో బ్లాక్ టాప్(బీటీ) రోడ్లు వేసినట్లు గుర్తుచేశారు. మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కేఎంసీ కమిషనర్ ఆద ర్శ్ సురభి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ, పగడాల శ్రీవిద్య, టీఆర్ఎస్ నేతలు ఖమర్, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.