
యావత్ దేశం గర్వించదగ్గ నాయకుడు మన ‘పాములపర్తి’
పీవీ సేవలను వెలుగులోకి తేవడంలో ‘నమస్తే’ కృషి అభినందనీయం
మాజీ ప్రధాని శత జయంతి ఉత్సవాల ముగింపులో మంత్రి అజయ్
ఖమ్మం, జూన్ 28: తెలంగాణ రాష్ట్రంతోపాటు యావత్ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు భారత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట (పీవీ) నర్సింహారావు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కొనియాడారు. పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఖమ్మం లకారం సర్కిల్లోని పీవీ విగ్రహానికి మంత్రి అజయ్, కలెక్టర్ కర్ణన్ సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు గత ఏడాది ఖమ్మం జిల్లా కేంద్రంలో లకారం సర్కిల్లో పీవీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనకు సముచిత గౌరవం కల్పించినట్లు గుర్తుచేశారు. పీవీ మన తెలంగాణ బిడ్డ మాత్రమే కాక.. యావత్ దేశం గర్వించదగ్గ గొప్ప దార్శనికుడని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణలు, ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహనీయుడని గుర్తుచేశారు. పీవీ గొప్పతన్నాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక చేసిన కృషి అభినందనీయమని అన్నారు. పీవీ శత జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఏడాది పొడవునా ఉత్సవాలు జరిపించారని, మహనీయుల స్మృతికి ఘన నివాళులర్పించి వారికి సముచిత స్థానం కల్పించాలరని వివరించారు. మేయర్ నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సీపీ విష్ణు ఎస్ వారియర్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషనం, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, ఏఎస్పీ స్నేహా మెహ్రా, డిప్యూటీ సీఈఓ కే.శ్రీరామ్, డీపీవో ప్రభాకర్, డీటీవో కిషన్‌రావు, డీఏవో విజయనిర్మల, డీఆర్డీవో విద్యాచందన, డీహెచ్‌వో అనసూయ, డీఎఫ్‌వో ప్రవీణ, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, టీఆర్ఎస్ నాయకులు తోట వీరభద్రం, మందడపు మనోహర్‌రావు. లింగాల రవికుమార్, మాటూరి లక్ష్మీనారాయణ, షేక్ షకీనా, తన్నీరు శోభారాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.