
అధికారులను ఆదేశించిన ప్రభుత్వ విప్ కాంతారావు
దమ్మక్కపేట, చిక్కుడుగుంట, సాంబాయిగూడెం గ్రామాల్లో పర్యటన
మణుగూరు రూరల్, డిసెంబర్ 27: మిషన్ భగీరథ పథ కం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ‘ఇంటింటికీ టీఆర్ఎస్ – గ్రామగ్రామానికీ కేసీఆర్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన దమ్మక్కపేట గ్రామంలో పర్యటించారు. వీధివీధికీ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా బీటీపీఎస్ ప్యాకేజీ రాలేద ని కొందరు, స్థానికులమైన తమకు బీటీపీఎస్‌లో ఉపాధి కల్పించాలని మరికొందరు వినతులు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే బీటీపీఎస్‌లో పూర్తిస్థాయిలో విద్యుత్ మొదలయ్యే నాటికి అవకాశం కల్పించేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై విద్యుత్ ఏఈ వేణుగోపాల్‌ను ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి సరఫరా చేయాలని ఆదేశించారు. చిక్కుడుగుంటలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని, గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో మిషన్ భగీరథ నీరు క్ర మం తప్పకుండా వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బీటీపీఎస్ శివారున ఉండడం వల్ల తమకు దుమ్ము ధూళి విపరీతంగా పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వివరించారు. జంగయ్య అనే వ్యక్తి ఇటీవల మృతిచెందడంతో రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అతడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం సాం బాయిగూడెంలో సర్పంచ్ కాయం తిరుపతమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు, అధికారులతో ముఖాముఖి ఏర్పా టు చేశారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ విజయకుమారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యంబాబు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, అధికారులు వేణుగోపాల్, అరుంధతి, హారిక, దీపాంజలి, సర్పంచులు కాయం తిరుపతమ్మ, కుర్సం రాంబాబు, పాల్వంచ ఈశ్వరమ్మ, నాయకులు కోలేటి భవానీశంకర్, వట్టం రాంబాబు, సకినిపల్లి బాబురావు, జావీద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.