
కొత్తగూడెం, అక్టోబర్ 27: తెలంగాణ ఉద్యమ సూరీడు కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన ఉన్నంత వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగూడెం క్లబ్లో టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు అధ్యక్షతన బుధవారం జరిగిన నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణలో టీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. ద్విదశాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ త్వరలో జాతీయస్థాయిలో కూడా గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్లీనరీ సక్సెస్ కావడంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయన్నారు. అలాగే చరిత్రలో నిలిచిపోయేలా వచ్చే నెల 15న వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరుగనుందన్నారు. దీనికి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పది వేల మంది కార్యకర్తలు తరలి వెళ్లాలని, 200 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
కేసీఆర్‌కు తిరుగులేదు..
రాష్ట్రంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు ఎవరూ లేరని, ఆయనకు తిరుగులేదని టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు అన్నారు. మరో 20 ఏళ్లూ టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, ఎంఏ రజాక్, కాసుల వెంకట్, తూము చౌదరి, రావి రాంబాబు, బీమా శ్రీధర్, బాదావత్ శాంతి, భూక్యా సోనా, భూక్యా విజయలక్ష్మి, మడివి సరస్వతి, బరపటి వాసుదేవరావు, బిందు చౌహాన్, భూక్యా రాంబాబు, బత్తుల వీరయ్య, మండె వీరహన్మంతరావు, అన్వర్‌పాషా, బాగం మోహన్‌రావు, కరుణాకర్, మంతపురి రాజుగౌడ్, లింగం పిచ్చిరెడ్డి, కొట్టి వెంకటేశ్వర్లు, బాగం ఉమామహేశ్వరరావు, ఎండీ ఉమర్, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి, వేల్పుల దామోదర్, కూచిపూడి జగన్, కాంపెల్లి కనకేశ్, ఎండీ రజాక్, ముప్పాని సోమిరెడ్డి, తాటిపల్లి శంకర్‌బాబు, మహిపతి రామలింగం, వజ్జా రాజు, కొల్లు పద్మ తదితరులు పాల్గొన్నారు.