
వేంసూరు, జూన్ 25: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.70 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధుతో రైతులకు సాయపడుతున్నదన్నారు. పథకం ద్వారా నియోజకవర్గంలో రూ.90 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ అయిందన్నారు. త్వరలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం మండల పరిధిలోని శంభునిగూడెంలో రూ.2.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలా వెంకటరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెల్ది జగన్మోహన్రావు, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, ఎంపీటీసీలు గొర్ల శ్రీనివాసరెడ్డి, నున్నా రాంబాబు, నాయుడు వెంకటేశ్వరరావు, మండల కో-ఆప్షన్ సభ్యుడు రహీం, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, సర్పంచ్‌లు ఫైజుద్దీన్, మందపాటి వేణుగోపాల్ రెడ్డి, పోట్రు ప్రసాద్, నల్లమోతు ప్రసాద్, గడిపర్తి రాంబాబు, మద్దిరెడ్డి పుల్లారెడ్డి, కూకలకుంట శ్రీనివాసరావు, కుక్కపల్లి రామకృష్ణ, కిన్నెర వెంకటేశ్వరరావు, నెల్లూరు రాకేశ్, జాబిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ అభినందనీయం
సత్తుపల్లి, జూన్ 25: గౌరిగూడెం సర్పంచ్ మందపాటి ముత్తారెడ్డి సొంత నిధులతో గ్రామస్తులకు వ్యాక్సిన్ వేయించడం అభినందనీయమన్నారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, కొత్తూరు ఉమ, నాయకులు టెక్స్మో రెడ్డి, చెన్నారెడ్డి, అంకిరెడ్డి సోదరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ పనులను పూర్తిచేయాలి
మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు శుద్ధజలం అందించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎస్ఈ శ్రీనివాసరావుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఈ స్వరూపారాణి, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ తదితరులు ఉన్నారు.