e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home ఖమ్మం పజలకు అండ.. టీఆర్‌ఎస్‌ జెండా

పజలకు అండ.. టీఆర్‌ఎస్‌ జెండా

20 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు
టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించాకే తెలంగాణకు మహర్దశ
అధ్యక్షుడిగా నేడు కేసీఆర్‌ ఎన్నిక.. అందరికీ పండుగ
విజయగర్జనతో మరోసారి సత్తా చాటుతాం
మంత్రి అజయ్‌కుమార్‌

ఖమ్మం, అక్టోబర్‌ 24;‘గులాబీ జెండా ప్రజలకు అండగా నిలుస్తున్నది.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చే క్రమంలో ఉద్యమ పార్టీ ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నది.. ఉద్యమ నేత కేసీఆర్‌ ఎన్నో జయాపజయాలను చవిచూశారు.. వ్యూహ ప్రతివ్యూహాలతో రాష్ర్టాన్ని సాధించారు.. రెండు దశాబ్దాలలో టీఆర్‌ఎస్‌ను అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దారు.. ముఖ్యమంత్రిగా రాష్ర్టానికి సేవలందిస్తున్నారు..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం పార్టీ నాయకులతో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపై ప్రతిపక్ష నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ సహనాన్ని పరీక్షించొద్దన్నారు.. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చే క్రమంలో కేసీఆర్‌ ఎన్నో జయాపజయాలను చవిచూశారని, తెలంగాణ సమాజంపై తనకున్న ప్రేమతో అనేక వ్యూహ ప్రతివ్యూహాలతో రాష్ర్టాన్ని సాధించిన వైతాళికుడు కేసీఆర్‌ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001 ఏప్రిల్‌ 27న కొద్దిమందితో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన కేసీఆర్‌.. 20 ఏండ్లలో రాష్ట్ర చరిత్ర గతులనే మార్చి వేసిన ఉద్దండుడయ్యారని కొనియాడారు. ఆవిర్భావం నుంచి 14 ఏండ్ల పాటు అవిశ్రాంతంగా, శాంతియుతంగా ఉద్యమం నడిపిన మహానేత కేసీఆర్‌ అని గుర్తుచేశారు. అందువల్లనే ప్రత్యేక తెలంగాణ కల సాకరమైందని అన్నారు.
మరుగుజ్జు నాయకులతో నష్టం లేదు..
కేసీఆర్‌ తెలంగాణను సాధించకపోతే ఈ రోజు నోటికి వచ్చినట్లు మాట్లాడే మరుగుజ్జు నాయకులకు పదవులు వచ్చేవా అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. ఒక సీఎం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని, ఎన్ని బూతులు తిడుతున్నా సంస్కారంగా ఉంటున్నామని అన్నారు. టీఆర్‌ఎస్‌ సహనాన్ని చేతకాని తనంగా చూడవద్దని హెచ్చరించారు.
మా పథకాలనే బీజేపీ కాపీ కొడుతోంది..
తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలను దేశంలోనే అనేక పార్టీలు కాపీ కొడుతున్నాయని, అందులో బీజేపీ కూడా ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాల కంటే తెలంగాణ జీడీపీ రెండింతలు ఎక్కువ అని గుర్తుచేశారు.
పటిష్టమైన నిర్మాణం
తెలంగాణ ఆవిర్భవించిన ఈ ఏడున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ పటిష్టమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుందని అజయ్‌ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తర్వాత జిల్లా కమిటీల నియామకం ఉంటుందన్నారు. ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం నాటి ప్లీనరీలో మరోసారి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకునే సందర్భం అందరికీ పండుగ లాంటిదని అన్నారు. ఆహ్వానం ఉన్న ప్రతి సభ్యుడూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. నవంబర్‌ 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలిరావాలని కోరారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మేయర్‌ నీరజ, సుడా చైర్మన్‌ విజయ్‌కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా, కార్పొరేటర్లు కమర్తపు మురళి, దోరేపల్లి శ్వేత, రాపర్తి శరత్‌, తోట ఉమారాణి, గజ్జెల లక్ష్మి, టీఆర్‌ఎస్‌ నేతలు ఆర్‌జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, చింతనిప్పు కృష్ణ చైతన్య, తాజుద్దీన్‌, డోకుపర్తి సుబ్బారావు, గుళ్లపల్లి శేషగిరిరావు, పగడాల నరేందర్‌, శంకర్‌రావు, వీరునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

    - 
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement