e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home ఖమ్మం ప్రాపర్టీ షో అదిరెన్

ప్రాపర్టీ షో అదిరెన్

  • అవగాహన వేదికలు.. రియల్‌ ఎస్టేట్‌ స్టాళ్లు
  • తొలిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి
  • స్టాళ్లను సందర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
  • ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో నిర్వహణ
  • నేడూ కొనసాగింపు
  • ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి అజయ్‌కుమార్‌

ఖమ్మం అక్టోబర్‌ 23: ప్లాట్లు కొనాలి.. ఇల్లు కట్టుకోవాలని అందరికీ ఉంటుంది.. ఎంత కష్టపడైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సొంత ఇల్లు కట్టుకుని తీరాలనుకుంటాం.. కానీ స్థలాలు, ఇండ్లు కొనబోయే ముందు ఏయే అనుమతులు ఉన్న వెంచర్లు కొనుగోలు చేయాలి..? హౌసింగ్‌ లోన్స్‌ ఎలా తీసుకోవాలి..? విల్లాలు, ఇండ్లు కొనుగోలు చేయాలంటే ఎలాంటి అనుమతులు ఉండాలి..? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ ఖమ్మం నగరంలోని రాజ్‌పథ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ప్రతిష్ఠాత్మకంగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి శనివారం ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీ షోకు కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. అంతేకాదు హౌసింగ్‌ లోన్స్‌పై అవగాహన కల్పించేందుకు బ్యాంకర్లు అందుబాటులో ఉండడం కొనుగోలుదారులకు కలిసివచ్చింది. తొలిరోజు ప్రాపర్టీ షోను నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రెండో రోజు ఆదివారం ప్రాపర్టీ షోకు మంత్రి అజయ్‌కుమార్‌ హాజరుకానున్నారు.

ఖమ్మం నగరంలోని రాజ్‌పథ్‌ ఫంక్షన్‌ హాల్‌ వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ నిర్వహించిన ప్రాపర్టీ షో తొలిరోజు విజయవంతమైంది. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా సందర్శకులు తరలివచ్చారు. ఆదివారం ముగింపు కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. కొనుగోలుదారులు ఒకే చోట తమకు నచ్చిన ప్రాపర్టీస్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. బ్యాంకుల ప్రతినిధులు వారికి రుణ సదుపాయాల గురించి వివరించారు. ప్రాపర్టీ షోకు ఖమ్మం జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి కొనుగోలుదారులు విచ్చేశారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ చేపట్టిన ప్రాపర్టీ షో ఉపయోగకరంగా ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి, ఎస్బీఐటీ విద్యాసంస్థల అధినేత గుండాల కృష్ణ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మంత్రి అజయ్‌కుమార్‌ పీఏ చిరుమామిళ్ల కిరణ్‌కుమార్‌, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పసుమర్తి రామ్మోహన్‌రావు, తండా జ్యోతిరెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకుడు బాగం హేమంతరావు, టీఆర్‌ఎస్‌ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, నాయకులు తాజుద్దీన్‌, పిన్ని కోటేశ్వరరావు, పాపారావు, నర్రా యల్లయ్య, శ్రీబాలాజీ ఎస్టేట్స్‌, కన్‌స్ట్రక్షన్స్‌ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వత్సవాయి రవి, మార్కెటింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీవీకే చారి, శ్రీ సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గరికపాటి విజయ్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ భరత్‌, సేల్స్‌ మేనేజర్‌ శ్రీను, శ్రీ జయ విలాసిని డెవలపర్స్‌, కన్‌స్ట్రక్షన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుంచపు రాంబాబు, మేనేజర్‌ ఎస్కే ఖాజామియా, సంస్థ ప్రతినిధులు నవ్య, జహీర్‌, వెంకట్‌, శ్రీకాంత్‌, సన్సేషన్‌ ఇన్‌ఫ్రా మేనేజర్లు విష్ణువర్థన్‌, గంగాప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నయీం, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వినయ్‌, వర్మా స్టీల్‌ ప్రతినిధులు శిరీష, సుదర్శన్‌, అనిల్‌, నాగేందర్‌, హర్షిణి డెవలపర్స్‌ సేల్స్‌ డైరెక్టర్‌ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.గణేశ్‌కుమార్‌, మేనేజర్‌ అనీల్‌కుమార్‌, జనరల్‌ మేనేజర్‌ పవన్‌కుమార్‌, ఇండో ఖతార్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ మనోహర్‌, ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ నవీన్‌, పూర్ణ, శ్రీనిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉన్నం జగన్‌, డైరెక్టర్లు గణాచారి, వెంకటేశ్వర్లు, గుర్రం శ్రీనివాసరావు, రియో హవెల్స్‌, డిస్ట్రిబ్యూటర్‌ ఫరీద్‌, సేల్స్‌ మేనేజర్‌ షోయాల్‌, వి-4 చిమ్నీవరల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు సురేశ్‌, శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ నవీన్‌, బీజీఆర్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ గోపాల్‌రెడ్డి, మార్కెటింగ్‌ మేనేజర్‌ మధు, సీనియర్‌ టెక్నీషియన్‌ రాఘవ, తాటిపల్లి ఇన్‌ఫ్రా ప్రతినిధులు మహేశ్‌, కిరణ్‌, అమెరికన్‌ టౌన్‌షిప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు ఎండీ మైబిల్‌సాబ్‌, బి.కిశోర్‌, ఎండీ లాల్‌సాహెబ్‌, ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్‌ జి.సురేశ్‌నాయక్‌, రీజినల్‌ మేనేజర్‌ కె.శరత్‌, మేనేజర్‌ నాగరాజు, డిప్యూటీ మేనేజర్‌ మల్లిక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ జగదీశ్‌నాయక్‌, మేనేజర్‌ అనిల్‌బాబు, మేనేజర్‌ భూపేందర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ కిశోర్‌కుమార్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆర్‌-సీఏజీ హేమంత్‌, మేనేజర్‌ ఫిరోజ్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సౌమి, కెనరా బ్యాంక్‌ డిప్యూటీ మేనేజర్‌ టి.నిరంజన్‌, చీఫ్‌ మేనేజర్‌ ఆర్‌ఎం గౌడ, మేనేజర్‌ కె.ఎర్రయ్య, మార్కెటింగ్‌ ఆఫీసర్స్‌ సురేందర్‌, చంద్రశేఖర్‌, బ్యాంక్‌ బరోడా బ్రాంచ్‌ మేనేజర్‌ జగదీశ్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ మోహన్‌, బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌, నమస్తే తెలంగాణ బ్రాంచ్‌ మేనేజర్‌ రేనా రమేశ్‌, ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్‌చార్జి వేణు, ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ పూర్ణచందర్‌రావు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రాజిరెడ్డి, యాడ్స్‌ మేనేజర్‌ బోయిన శేఖర్‌బాబు, సిబ్బంది వల్లోజు వెంకన్న, పసుపులేటి నాగరాజు, సురేందర్‌రెడ్డి, సురేశ్‌, కరుణాకర్‌, దశరథ్‌, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, సర్క్యులేషన్‌ మేనేజర్‌ అజయ్‌, సిబ్బంది రాంబాబు, భద్రం, టెక్నికల్‌ ఇన్‌చార్జి భిక్షపతి, సబ్‌ఎడిటర్లు రతన్‌, వంశీ, శ్రీనివాస్‌, పుల్లారావు, ప్రసాద్‌, శ్రీధర్‌, జానీ, రాంబాబు, రిపోర్టర్లు శీలం శ్రీనివాస్‌, బోయిన కృష్ణ, చేకూరి గోపాలరావు, తీగల నాగరాజు, పూనాటి మనోజ్‌, మద్దెల లక్ష్మణ్‌, అకౌంటెంట్‌ విజయ్‌, హెచ్‌ఆర్‌ శ్రీను, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్బీహెచ్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement