e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home ఖమ్మం నేడు, రేపు ప్రాపర్టీ షో

నేడు, రేపు ప్రాపర్టీ షో

తొలిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌
ముగింపు కార్యక్రమానికి మంత్రి అజయ్‌ కుమార్‌

హాజరుకానున్న ఎంపీ నామా, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు
ఖమ్మం, అక్టోబర్‌ 22: నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఖమ్మంలోని రాజ్‌పథ్‌ ఫంక్షన్‌ హాల్‌లో వినూత్న రితీలో ప్రాపర్టీ షో జరుగనున్నది. శ్రీ బాలాజీ రియల్‌ ఎస్టేట్స్‌, శ్రీసిటీ , శ్రీ జైవిలాసిని డెవలపర్స్‌ అండ్‌ కనస్ట్రక్షన్స్‌, శ్రీనిధి ఎన్‌క్లేవ్‌, ఇండో ఖతార్‌, వర్మ, కేకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు, అమెరికన్‌ టౌన్‌షిప్‌, వి-4 చిమ్నీ వరల్డ్‌, బీజీఆర్‌ ఇండస్ట్రీస్‌, శ్రీమిత్రా గ్రూప్‌ , హర్షిణి డెవలపర్స్‌, తాటిపల్లి ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్స్‌, హోటల్‌ కావేరి సౌజన్యంతో ప్రాపర్టీ షో జరుగనున్నది. తొలిరోజు కార్యక్రమాన్ని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి ప్రారంభించనున్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ప్రతినిధులు, భవన నిర్మాణ రంగంలో అపార అనుభవం ఉన్న బిల్డర్లు ప్రత్యేక స్టాల్స్‌ ద్వారా వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందించనున్నారు. ఇండ్ల స్థలాలు, భవనాలు కొనుగోలుపై ఆసక్తి ఉన్న వారికి నిబంధనలకు లోబడి రుణ సదుపాయం కల్పించేందుకు జాతీయ బ్యాంకుల ప్రతినిధులు ప్రాపర్టీ షోలో పాల్గొననున్నారు. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, కెనెరా బ్యాంక్‌ బ్యాంకింగ్‌ పార్టనర్స్‌గా, హైదరాబాద్‌లోని నీలోఫర్‌ గిఫ్ట్‌ హేంపర్స్‌ గిఫ్ట్‌ పార్టనర్‌గా వ్యవహరించనున్నాయి.

హాజరుకానున్న ప్రజాప్రతినిధులు..
ప్రాపర్టీ షోలో ఆదివారం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోకు ఎంపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్‌, హరిప్రియానాయక్‌, మెచ్చా నాగేశ్వరరావు, శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, రెండు జిల్లాల గ్రంథాలయాల సంస్థల చైర్మన్లు ఖమర్‌, దిండిగాల రాజేందర్‌, ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఖమ్మం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement