
తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో మరెక్కడా లేవు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంలో చెక్కుల పంపిణీ
బుల్లెట్ బండిపై ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి
ఖమ్మం, డిసెంబర్ 21: ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఖమ్మం నగరంలో రెండో రోజు మంగళవారం పంపిణీ చేశారు. బుల్లెట్ బండిని నడుపుతూ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చీరె, సారెతోపాటు చెక్కును ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ర్టాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని గుర్తుచేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబార్ పథకాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలమంది తల్లిదండ్రులు ధైర్యంగా కుమార్తెల వివాహాలను చేయగలుగుతున్నారని అన్నారు. కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, చింతనిప్పు కృష్ణచైతన్య, మాటేటి కిరణ్‌కుమార్, బలుసు మురళీకృష్ణ, తౌసిఫ్, తాజుద్దీన్, ఖమర్, శోభారాణి, షకీనా, దేశబోయిన తిరపయ్య, మస్తాన్, ధనాల రాధ, గజ్జల లక్ష్మి, వెంకన్న, ఎర్రా అప్పారావు, పత్తిపాక రమేశ్, మిట్టపల్లి రవి, రాజేశ్, కమల, ఎర్రా గోపి, రాంబాబు, దోన్వాన్ సరస్వతి, రవి, తోట ఉమారాణి, వీరభద్రం, రుద్రగాని శ్రీదేవి, ఉపేందర్, రామ్మోహన్రావు, కన్నం వైష్ణవి ప్రసన్న, మాటేటి నాగేశ్వరరావు, లక్ష్మి, తోట రామారావు, మలీదు వెంకటేశ్వర్లు, దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి, నర్రా ఎల్లయ్య, చిరుమూరి కోటి, హెచ్ ప్రసాద్, ఎండీ ఫయాజ్, షేక్ రజీమ్, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చెక్కుతోపాటు చీరె, సారె..
లబ్ధిదారులకు చెక్కుతోపాటు చీరె, సారెను మంత్రి అందజేశారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 14, 15, 17, 27, 28, 29, 30, 31, 32, 33, 34. 35, 46, 47, 48 డివిజన్లలో బుల్లెట్ బండిపై ఇంటింటికీ వెళ్లారు.