
తెలంగాణ ప్రతినిధి బృందాన్ని అవమానించిన కేంద్రం
ఇది కేంద్రం బాధ్యతా రహిత్యానికి నిదర్శనం
రైతుల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోం
బీజేపీని హెచ్చరించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
తల్లాడ, డిసెంబర్21 : తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు, అభివృద్ధి విషయం లో కేంద్ర సర్కార్ తీవ్ర ద్రోహం చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆ గ్రహం వ్యక్తం చేశారు. రైతు లు పండించిన ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ వెళ్లిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందాన్ని బీజేపీ ప్ర భుత్వం అవమానించడం సరికాదన్నారు. మంగళవారం తల్లాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతుల తరఫున వెళ్లిన ప్రతినిధి బృందం వాదన వినకుండా కేంద్ర మంత్రులు పియూష్గోయల్, కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలను ఉద్దేశించి కేంద్ర మంత్రి పియూష్గోయల్ మాట్లాడుతూ ఈ ఒక్క సమస్య తప్ప దేశంలో వేరే సమస్యలు లేవా అని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేయకుండా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తున్నా.. కేంద్ర ప్ర భుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని ఎమ్మె ల్యే ధ్వజమెత్తారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర మంత్రులు ప్రకటించగా.. తెలంగాణలో బీజేపీ నాయకులు యాసంగిలో వరిసాగు చేయాలని ప్రచారం చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రైతుల మధ్య చిచ్చుపెడుతూ రాష్ర్టాన్ని రావణకాష్టంలా మార్చి రాక్షస ఆనందం పొందాలని చూస్తున్నారన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, ఏఎంసీ వైస్‌చైర్మన్ దూపాటి భద్రరాజు, జోన్ కన్వీనర్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావు, సర్పంచ్ నారపోగు వెంకటేశ్వర్లు, అయిలూరి శివారెడ్డి, పోతురాజు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.