పాల్వంచ, సెప్టెంబర్ 11 : కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.215 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరాకాలనీ, హమాలీ కాలనీ, కరకవాగు, సీతారాంపట్నం ప్రాంతాల్లో రూ.11 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం.. కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు మోసగాళ్లు డబ్బుల సంచులతో ప్రజల ముందుకు వస్తున్నారని, అలాంటి కపట మోసగాళ్ల మాటలు నమ్మొదన్నారు. ప్రజా సం క్షేమం, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్కే ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకోవాలన్నారు. కొత్తగూడెం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తిరిగి తనకే సీఎం కేసీఆర్ సీటు కేటాయించారన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించి సీఎంకు బహుమతి ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఎన్నికల ముందు కనపడే నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని, 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నానని గుర్తు చేశారు. కొత్తగూడెం-పాల్వంచను జంట నగరాలుగా తీర్చిదిద్దుతున్నానని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ అజ్మీరా స్వామి, డీఈ మురళి, ఏఈ రాజేశ్, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడివి సరస్వతి, పెద్దమ్మగుడి చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, మల్లెల శ్రీరాంమూర్తి, పూసల విశ్వనాథం, ఎస్వీఆర్కే ఆచార్యులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కాల్వ ప్రకాశరావు, దాసరి నాగేశ్వరరావు, బేతంశెట్టి విజయ్, రాజశేఖర్, కుమ్మరికుంట్ల నాగ, మదార్, బాషా, బట్టు సురేశ్, గంగుల నరేందర్రెడ్డి, నామా నవీన్ తదితరులు పాల్గొన్నారు.