శనివారం 05 డిసెంబర్ 2020
Khammam - Nov 23, 2020 , 01:09:08

కమ్మేస్తున్న.. మంచుతెరలు

కమ్మేస్తున్న.. మంచుతెరలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మంచుతెరలు కమ్మేస్తున్నాయి. రహదారులు, పంటచలను మంచు దుప్పటిలా కప్పేస్తున్నాయి.


ఉదయం 8 గంటలు దాటినా మంచు తొలగక పోవడంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చలి తీవ్రతకు వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రావటానికే జంకుతున్నారు. మరో వైపు ప్రకృతి ప్రేమికులు ఉదయాన్నే పంట పొలాల్లో కురుస్తున్న పొగ మంచును చీల్చుకుని వస్తున్న సూర్యుడి అందాలను చూసి తరించిపోతున్నారు. ఆహ్లాదాన్ని పంచుతున్న మంచుతెరల చిత్రాలను ఏజెన్సీలోని కరకగూడెం మండలంలో    నమస్తే తెలంగాణ క్లిక్‌ మనిపించింది.  

-కరకగూడెం/కూసుమంచి రూరల్‌