బుధవారం 02 డిసెంబర్ 2020
Khammam - Jul 09, 2020 , 02:20:06

స్వల్పంగా పెరిగిన గోదారి..

స్వల్పంగా పెరిగిన గోదారి..

భద్రాచలం పట్టణం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు నీటిమట్టం 20 అడుగులకు చేరుకుంది. గత వారం రోజులుగా ఏజెన్సీతో పాటు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీరు చేరుకుంటుంది. గోదావరి వరద పెరగడంతో స్నానఘట్టాల వద్ద పురోహితులు వేసుకున్న పాకలు నీట మునిగాయి.   -భద్రాచలం