Bhaje Vayu Vegam | కార్తికేయ గుమ్మకొండ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘భజే వాయువేగం’. ఐశ్వర్య మీనన్ కథానాయిక. రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకుడు. ప్రతిష్మాత్మక యూవీక్రియేషన్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు చెందిన తొలి లిరికల్ సాంగ్‌ని గురువారం మేకర్స్ విడుదల చేశారు.
‘సెట్ అయ్యిందే.. లైఫ్ సెట్ అయ్యిందే.. నీ వల్లే నా లైఫ్ సెట్టయ్యిందే.. సెట్ అయ్యిందే.. లైఫ్ సెట్టయ్యిందే.. నా లవ్‌స్టోరీ బ్లాక్‌బస్టర్ అయ్యిందే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, రధన్ స్వరపరిచారు. రంజిత్ గోవింద్ ఆలపించారు. హోలీ సంబరాల నేపథ్యంలో కలర్ఫుల్గా ఈ పాటను చిత్రీకరించినట్టు మేకర్స్ తెలిపారు. ఈ గీతంలో కార్తికేయ, ఐశ్వర్యమీనన్ చేసిన హుక్‌స్టెప్ పాటకే హైలైట్‌గా నిలుస్తుందని వారు అన్నారు. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మధు శ్రీనివాస్, కెమెరా: ఆర్.డి.రాజశేఖర్.సహనిర్మాత: అజయ్కుమార్రాజు.పి.